‘ఈస్ట్రన్ ఐ’ ఏషియన్ సెలబ్రిటీల్లో నెం.1గా సోనూసూద్

ప్రముఖ యూకే మ్యాగజైన్ ఈస్ట్రన్ ఐ ఏషియన్ సెలబ్రిటీ గ్లోబల్ 2020 పేరుతో చేపట్టిన సర్వేలో సోనుసూద్ నెంబర్ వన్ గా నిలిచాడు. లాక్ డౌన్ సమయంలో వలస కార్మికులకు ఇతోధికంగా సాయం చేసిన సోనూసూద్ కు ఈ గౌరవం ఇచ్చినట్టు నిర్వాహకులు తెలిపారు. దేశవ్యాప్తంగా హీరో అయిపోయిన సోనూసూద్ ఇందుకు అర్హుడని తెలిపింది. సినిమాల్లో విలన్ గా చేస్తున్న సోనూ నిజజీవితంలో చారిటీని కొనసాగిస్తున్నాడు. దీనిపై సోనూసూద్ స్పందించాడు.

‘ఈ గౌరవంతో నా బాధ్యత మరింత పెరిగింది. దేశ ప్రజలకు సేవ చేసేందుకు మరింత ఉత్సాహం వచ్చింది. నా తుది శ్వాస వరకూ ఈ సేవలు చేస్తాను. నన్ను గుర్తించి ఈ అవార్డు ఇచ్చినందుకు ఈస్ట్రర్న్ ఐ మ్యాగజైన్ కు ధన్యవాదాలు’ అంటూ తన ట్విట్టర్ అకౌంట్ లో రాసుకొచ్చాడు. ఇక ఈ సర్వేలో ప్రియాంక చోప్రాకు 6వ స్థానం, ప్రభాస్ కు 7వ స్థానం దక్కాయి.