ట్రాక్ట‌ర్ కొనిచ్చా, కానీ ఓ మాట తీసుకున్నా..

మ‌న చుట్టూ స‌మాజంలో ఎన్నో జ‌రుగుతుంటాయి. కొన్నిటిని చూస్తూ వెళ్లిపోతాం, కొన్నింటి ద‌గ్గ‌ర ఆగి ఓ క్ష‌ణం జాలిప‌డ్డ త‌ర్వాత‌ అక్క‌డి నుంచి క‌దులుతాం. కానీ సినీ విల‌న్‌, రియ‌ల్ హీరో సోనూ సూద్ అలా చేయ‌లేదు. త‌నకు క‌నిపించే క‌ష్టాన్ని చూసి క‌దిలిపోయారు. జాలిప‌డితే ఫ‌లితం రాద‌ని ఆయ‌న‌కు బాగా తెలుసు. అందుకే క‌ష్ట‌మైనా న‌ష్ట‌మైనా వారికి సాయం చేయాల‌ని త‌లిచారు. ఆ సంక‌ల్ప‌మే అత‌డిని ముందుకు న‌డిపించింది. త‌న ఆస్తిని తాక‌ట్టు పెట్టి మ‌రీ ఆప‌ద‌లో ఉన్న‌వారికి సాయం చేస్తూ అండ‌గా నిల‌బ‌డుతున్నారు. ఈ లాక్‌డౌన్‌లోని ఎన్నో క‌థ‌ల‌ను ఆయ‌న పుస్త‌క రూపంలో తీసుకొచ్చారు. “ఐయామ్ నో మెస్స‌‌య్య”‌(నేను ర‌క్ష‌కుడిని కాదు) పేరుతో ఇటీవ‌లే ఇది మార్కెట్లోకి వ‌చ్చింది. అందులో సోనూ చిత్తూరువాసి నాగేశ్వ‌ర్ రావు గురించి ప్ర‌స్తావించిన‌ రియ‌ల్ స్టోరీ ఇది..

రైతును ఆదుకున్న‌ ట్రాక్ట‌ర్‌..
రైతు పేరు: నాగేశ్వ‌ర్ రావు, అత‌డి కుటుంబం
ప్రాంతం: చిత్తూరు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
స‌మ‌స్య‌: పేద‌రికంతో కూతుళ్ల‌తో పొలం దున్నించ‌‌డం
ప‌రిష్కారం: రైతుకు ట్రాక్ట‌ర్‌, అత‌డి కూతుళ్ల‌కు విద్య‌ను అందించ‌డం

స‌మ‌యంతో సంబంధం లేకుండా పొలాల్లో ప‌ని చేసేవారికి ఇది అంకితం. ఇది నా సొంతంగా చెప్తున్న లైను కాదు. ఓసారి ఎక్క‌డో చ‌దివాను, ఇక్క‌డ‌ స‌రిగ్గా స‌రిపోతుంది అనిపించింది. క్రిష్ణ‌మూర్తి అనే వ్య‌క్తి చిత్తూరులోని మ‌ద‌న‌ప‌ల్లికి చెందిన ట‌మాట రైతు ప‌డుతున్న క‌ష్టాల‌ను వీడియో తీసి జూలై 25న‌ షేర్ చేశాడు. అందులో ఆ రైతు కాడెడ్ల‌కు బ‌దులుగా క‌న్న‌ కూతుళ్ల‌తో పొలం దున్నించాడు. అది చూసి నా మ‌న‌సు చ‌లించిపోయింది. చ‌దువుకోవాల్సిన పిల్ల‌లు పొలం దున్న‌డం ఏంట‌ని బాధ‌ప‌డ్డాను. ఆ దృశ్యం నా మెద‌డులో బ‌లంగా నాటుకుపోయింది. కేవ‌లం బాధ‌ప‌డితే ప్ర‌యోజ‌నం ఉండ‌దు. అందుకే వాళ్ల‌కు ఆప‌న్న‌హ‌స్తం అందించాల‌నుకున్నా. ఆంధ్రాలో ఉన్న‌ నా స్నేహితుల‌ను అడిగి రైతు వివ‌రాలు అడిగితే అత‌డిది చిత్తూరులోని మ‌ద‌న‌ప‌ల్లివాసి అని తెలిసింది. ఆ రాష్ట్రంలో ఎన్నోసార్లు షూటింగ్‌కు వెళ్లాను కానీ చిత్తూరుకు వెళ్ల‌లేదు. అప్పుడే అనుకున్నా, ఒక్క‌సారైనా అక్క‌డికి వెళ్లి తీరాల‌ని! (చ‌ద‌వండి: నా బంగారు తల్లి.. డాషింగ్‌ బావ: వరుణ్‌ తేజ్‌)

అది శ‌నివారం రాత్రి 9.30 గంట‌లు. నా ఫ్రెండ్స్ రైతు ఫోన్ నంబ‌ర్ ఇవ్వ‌డంతో అతడికి కాల్ చేసి మాట్లాడాను. త‌న‌కో టీ స్టాల్ ఉండేద‌ని, కానీ క‌రోనా వ‌ల్ల అది మూత‌పడ‌టంతో చేతిలో చిల్లిగ‌వ్వ లేక‌ ఆక‌లితో అల‌మటించాల్సి వ‌స్తుంద‌ని నాగేశ్వ‌ర్ చెప్పాడు. అప్పుడే అత‌డికి మాటిచ్చాను. అమ్మాయిల భుజాల మీద కాడిని తీసేయండి, మీకు నేను ఎద్దుల‌ను కొనిస్తాను అని చెప్పాను. అత‌డు దానికి చాలా సంతోషించాడు. తిరుప‌తిలో ఎద్దులు ఉన్నాయ‌ని, వాటిని తీసుకుంటాన‌ని సంబ‌ర‌ప‌డ్డాడు. అంత‌లోనే నా బుర్ర‌లో ఓ లైటు వెలిగింది. ట్రాక్ట‌ర్ కొనిస్తే స‌రిపోతుంది క‌దా అనిపించింది. అదే మాట అత‌డితో చెప్పాను. కానీ దీనికి ప్ర‌తిఫ‌లంగా త‌న కూతుళ్ల‌ను చ‌దివించాల‌ని మాట తీసుకున్నాను. మాటిచ్చాన‌న్న మాటేగానీ అది ఆచ‌ర‌ణ‌లో పెట్ట‌గ‌ల‌నా అని నాలో సంఘర్ష‌ణ మొద‌లైంది. లాక్‌డౌన్‌లో అత‌డికి ట్రాక్ట‌ర్ పంపించ‌గ‌ల‌నా? అని ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకున్నాను. త‌ర్వాతి రోజు ఉద‌యం చ‌త్తీస్‌ఘ‌డ్‌లో ఉన్న‌ నా స్నేహితుడు క‌ర‌న్ గిల్హోత్రా సాయంతో ఇండియాలో టాప్ ట్రాక్ట‌ర్ కంపెనీల‌లో ఒక‌టైన సోనాలిక ట్రాక్ట‌ర్స్ కంపెనీకి సంబంధించిన ఏజెంట్‌తో మాట్లాడాను. అత‌డు ఆ రోజు సెల‌వులో ఉన్న‌ప్ప‌టికీ మా కోరిక బ‌ల‌మైన‌ది గ్ర‌హించి అదే రోజు సాయంత్రం 5 గంట‌ల‌క‌ల్లా ట్రాక్ట‌ర్‌ను రైతు క‌ళ్ల ముందుంచాడు.

ప్ర‌భుత్వం నుంచి ల‌బ్ధి పొందిన రైతు
రైతు నాగేశ్వరరావు అనేక ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ది పొందినట్టు ప్రభుత్వం గుర్తించింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి అతనికి అందిన సహాయం వివరాలు…
1. గత ఏడాది రైతు భరోసా కింద రూ.13,500 నేరుగా నాగేశ్వర్‌రావు ఖాతాలో జమ చేసిన ప్రభుత్వం
2. ఈ ఏడాది రైతు భరోసాలో భాగంగా ఇప్పటివరకూ రూ.7500 బదిలీ. మిగతా మొత్తం అక్టోబరు, జనవరిలో బదిలీ
3. నాగేశ్వర్‌రావు చిన్న కుమార్తెకు ‘జగనన్న అమ్మ ఒడి’ కింద గత జనవరిలో రూ.15,000 అందించిన ప్రభుత్వం
4. పెద్ద కూతురుకు ‘జగనన్న తోడు’ కింద లబ్ధికోసం దరఖాస్తు. చిరు వ్యాపారులకోసం ప్రభుత్వం వడ్డీలేని ఆర్థిక సహాయం ఈ పథకం కింద అందిస్తోంది.
5. నాగేశ్వర్‌రావు తల్లి అభయహస్తం కింద పెన్షన్‌ అందుకుంటోంది.
6. నాగేశ్వర్‌రావు తండ్రి వృద్ధాప్య పెన్షన్‌ కింద ప్రతి నెలా రూ.2250 అందుకుంటున్నారు.
7. కరోనా సమయంలో పేద కుటుంబాలను ఆదుకునేందుకు ప్రతి కుటుంబానికి అందించిన రూ.1000 సహాయాన్ని నాగేశ్వర్‌రావు కుటుంబం పొందింది. ఉచిత రేషన్‌ కూడా తీసుకుంది.
8. తనకున్న 2 ఎకరాల పొలంలో వేరు శెనగ వేయడానికి రైతు భరోసా కేంద్రం నుంచి డీఏపీ ఎరువు, విత్తనాలను నాగేశ్వర్‌రావు తీసుకున్నారు.