ఔను నిజమేనన్న సోనూసూద్‌

టాలీవుడ్‌ మరియు కోలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో విలన్‌ గా నటించి మెప్పించిన సోనూ సూద్‌ హిందీలో కూడా పలు భాషల్లో నటించాడు. అయితే ఈయన వరుసగా సౌత్‌ సినిమాల్లో నటించడంతో పాటు ఇకపై నిర్మాతగా కూడా మంచి కంటెంట్‌ సినిమాలను నిర్మించాలని భావిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. పలు భాషల్లో ఈయన సినిమాలను నిర్మిస్తాడనే ప్రచారం జరిగింది. ఎట్టకేలకు ఆ విషయమై క్లారిటీ ఇచ్చారు. ఔను నిజమే నేను సినిమా నిర్మాణంలో అడుగు పెట్టబోతున్నాను. ప్రస్తుతం మంచి కథల కోసం వెయిట్‌ చేస్తున్నాను అన్నాడు.

సోనూ సూద్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నిర్మాతగా మరియు హీరోగా మారేందుకు ఆసక్తిగా ఉన్నట్లుగా పేర్కొన్నాడు. త్వరలోనే మంచి కథ వస్తే తప్పకుండా నటించేందుకు సిద్దంగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇక మీడియం బడ్జెట్‌ తో సినిమాను చేసేందుకు తాను నిర్మాతగా కూడా రెడీ అవుతున్నట్లుగా పేర్కొన్నాడు. మొత్తానికి సోనూసూద్‌ కరోనా సమయంలో రియల్‌ హీరో ఇమేజ్ దక్కడంతో వరుసగా కొత్త ప్రాజెక్ట్‌ లను చేసేందుకు సిద్దం అవుతున్నాడు. ఈయన ఆచార్య సినిమాతో పాటు అల్లుడు అదుర్స్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాడు. వచ్చే ఏడాది నిర్మాతగా హీరోగా కూడా సోనూ సూద్‌ నుండి సినిమాలు వస్తాయేమో చూడాలి.