ప్రభాస్ ‘రాధేశ్యామ్’ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ – పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”రాధే శ్యామ్”. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణా మూవీస్ మరియు యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై వంశీ – ప్రమోద్ – ప్రశీద నిర్మిస్తున్నారు. ఇది పీరియాడికల్ నేపథ్యంలో జ్యోతిష్యానికి సైన్స్ కు మధ్య సాగే బ్యూటిఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. కోవిడ్ నేపథ్యంలో ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించి ఇటలీ షెడ్యూల్ ని పూర్తి చేసుకొని చిత్ర యూనిట్ ఇండియాకి తిరిగొచ్చారు. ఇటలీ పరిసర ప్రాంతాల్లోని అద్భుతమైన లొకేషన్స్ లో సాంగ్స్ తో పాటు కొన్ని యాక్షన్ సన్నివేశాలు కూడా చిత్రీకరించారని తెలుస్తోంది. ‘రాధేశ్యామ్’ సినిమా షూటింగ్ కి సంబంధించన ఎక్స్ టీరియర్ పార్ట్ మొత్తం ఇటలీలో.. ఇంటీరియర్ షూటింగ్ మొత్తం హైదరాబాద్ లో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

‘రాధేశ్యామ్’ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ మరియు రామోజీ ఫిలిం సిటీలలో ప్రత్యేకమైన సెట్స్ నిర్మాణం జరుగుతున్నట్లు సమాచారం. షూటింగ్ మొత్తం అన్నపూర్ణ 7 ఏకర్స్ లో చేయాలని భావించినప్పటికీ ‘బిగ్ బాస్ 4’ షో కి మూడు ఫోర్లు ఆల్రెడీ బుక్ అయిపోవడంతో కొన్ని సెట్స్ ఫిలింసిటీలో వేస్తున్నట్లుగా తెలిసింది. ఈ సినిమా కోసం మొత్తం మీద చిన్న పెద్దా అన్నీ కలిపి దాదాపు 60 సెట్స్ పైనే వేస్తున్నట్లుగా సమాచారం. ప్రభాస్ కెరీర్లో 20వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు మోషన్ టీజర్ విశేషంగా ఆకట్టుకున్నాయి. పాన్ ఇండియా లెవల్లో తెలుగు తమిళ హిందీ మలయాళ కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో జగపతిబాబు – సత్యరాజ్ – భాగ్యశ్రీ – కునాల్ రాయ్ కపూర్ – మురళి శర్మ – శాషా ఛత్రి – ప్రియదర్శి – రిద్దికుమార్ – సత్యాన్ తదితరులు నటిస్తున్నారు.