మొదటి సినిమాతోనే సూపర్ క్రేజ్ దక్కించుకున్న హీరోయిన్స్లో కన్నడ బ్యూటీ శ్రీలీల ఒకరు. శతాధిక దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన `పెళ్లి సందD` సినిమాతో శ్రీలీల టాలీవుడ్కు పరిచయం అయింది. శ్రీకాంత్ తనయుడు రోషన్ ఇందులో హీరోగా నటించగా.. రాఘవేంద్రరావు సైతం కీలక పాత్రను పోషించారు.
దసరా కానుకగా గత ఏడాది విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబట్టి హిట్గా నిలిచింది. ముఖ్యంగా ఈ సినిమాలో శ్రీలీల తనదైన అందం అభినయం నటన మరియు చలాకీతనంతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో ఈ బ్యూటీకి మరిన్ని అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రస్తుతం శ్రీలీల రవితేజ హీరోగా రూపుదిద్దుకుంటున్న `ధమాకా` సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. అలాగే మరిన్ని ప్రాజెక్ట్స్కు సైతం ఈమె సైన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న చందంగా..వరుస ఆఫర్లు వస్తున్న తరుణంలోనే శ్రీలీల తన రెమ్యునరేషన్ను భారీగా పెంచేసి నిర్మాతలకు చుక్కలు చూపిస్తుందట.
తొలి సినిమా అయిన `పెళ్లి సందD`కి రూ. 5 లక్షల లోపే రెమ్యునరేషన్ను అందుకున్న శ్రీలీల.. ప్రస్తుతం రూ.1 కోటి వరకు డిమాండ్ చేస్తోందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే నెటిజన్లు `ఇది మరీ టూ మచ్ అంతొద్దు.. కాస్త తగ్గించుకో` అంటూ శ్రీలీలను ట్రోల్ చేస్తున్నారు.