మరో నిర్మాత కుమారుడిని లాంచ్ చేస్తోన్న శ్రీకాంత్ అడ్డాల

దర్శకుడిగా శ్రీకాంత్ అడ్డాల మంచి స్థాయిని ఏర్పరుచుకున్నారు. చేసినవి తక్కువ సినిమాలే అయినా కూడా శ్రీకాంత్ అడ్డాల టాలెంటెడ్ అన్న విషయాన్ని నిరూపించుకున్నాడు. కొత్త బంగారు లోకం వంటి సినిమాతో ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు ఈ దర్శకుడు. అలాగే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి బిగ్గెస్ట్ మల్టీస్టారర్ తో ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేసాడు.

అయితే బ్రహ్మోత్సవంతో బిగ్గెస్ట్ డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్న శ్రీకాంత్ అడ్డాల మూడు సంవత్సరాల పాటు సినిమా చేయలేదు. ప్రస్తుతం సురేష్ బాబు శ్రీకాంత్ అడ్డాలకు మరో అవకాశం ఇచ్చిన విషయం తెల్సిందే. వెంకటేష్ హీరోగా నారప్ప చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. దీని తర్వాత శ్రీకాంత్ అడ్డాల చేయబోయే సినిమాపై కూడా పూర్తి క్లారిటీ వచ్చేసింది.

ఆర్ట్ డైరెక్టర్ తో పాటు నిర్మాతగా కూడా సినిమాలు నిర్మించిన చంటి అడ్డాల కుమారుడిని హీరోగా లాంచ్ చేస్తున్నారు. ఈ లాంచ్ బాధ్యతలను శ్రీకాంత్ అడ్డాల తీసుకున్నాడు. కూచిపూడి వారి వీధిలో అనే టైటిల్ ను కూడా కన్ఫర్మ్ చేసారు.