రోబో వంటి బ్లాక్ బస్టర్ ను డైరెక్ట్ చేసిన తర్వాత అగ్ర దర్శకుడు శంకర్ 3 ఇడియట్స్ సినిమాను చూసి ఫ్లాట్ అయిపోయి దాన్ని రీమేక్ చేద్దామనుకున్నారు. శంకర్ కెరీర్ లో ఉన్న ఒకే ఒక్క రీమేక్ అది. ముందుగా ఆమిర్ ఖాన్ రోల్ కోసం సూపర్ స్టార్ మహేష్ బాబును అనుకున్నాడు.
మహేష్ కు రీమేక్స్ ఇష్టం లేకపోయినా అడిగింది శంకర్ కావడంతో చేద్దామనే అనుకున్నాడు. అయితే ఈలోగా శ్రీను వైట్ల దూకుడు సినిమా ఒప్పుకున్నాడు. ఆ సినిమా షూటింగ్ మధ్యలో ఉండగానే శంకర్ చిత్రానికి నో చెప్పాడట మహేష్.
శ్రీను వైట్ల ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని రివీల్ చేసాడు. తాను ఒక కీలక సన్నివేశం రాసుకుని డైలాగ్స్ తో పాటు మహేష్ కు నరేట్ చేయగానే వెంటనే నమ్రతకు ఫోన్ చేసి తనకు ఇప్పుడు దూకుడు ప్రయారిటీ అని, శంకర్ సినిమాను చేయాలనేని చెప్పినట్లు శ్రీను వైట్లే తెలిపాడు.
తన చిత్రం మీద ఫోకస్ పెట్టడానికి శంకర్ సినిమాను వదులుకోవడం తనను ఆశ్చర్యపరిచిందని శ్రీను వైట్ల అభిప్రాయపడ్డాడు.