నాగశౌర్య హీరోయిన్ పారితోషికం కోటి కాదట


యంగ్ హీరో నాగశౌర్య వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఈ ఏడాది అశ్వథ్థామ సినిమాతో ఆరంభంలో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కరోనా కారణంగా కొత్త సినిమాలు ఏమీ విడుదల కాలేదు. దాదాపు అయిదు ఆరు నెలలు ఖాళీగా ఇంట్లో ఉండకుండా ఈయన కొన్ని కథలను ఓకే చేసినట్లుగా తెలుస్తోంది. ఆ సినిమాలను ఒకదాని తర్వాత ఒకటి ఈయన చేస్తున్నాడు. తన బ్యానర్ ఐరా క్రియేషన్స్ లో కొత్త సినిమాను ఇటీవలే ప్రారంభించాడు. ఆ సినిమాలో నటించబోతున్న హీరోయిన్ విషయం తాజాగా సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయ్యింది. ఆమెకు కోటి పారితోషికం అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో అంతా కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్న ఈ సినిమా కోసం ప్రముఖ గాయిని షిర్లీ సెటియా ను ఎంపిక చేశారట. ఈ సినిమాకు ఏకంగా కోటి రూపాయల పారితోషికంను ఆమె అందుకోబోతుంది అనేది పుకార్ల సారాంశం. దాంతో కొత్త హీరోయిన్ కు కోటి రూపాయల పారితోషికం ఏంటీ బాబు అంటూ చాలా మంది ముక్కున వేలేసుకుంటున్నారు. పాపులారిటీ లేని అమ్మాయిని అంత పెట్టి తీసుకు వచ్చే బదులుగా ఇక్కడే కోటి రూపాయలకు స్టార్ హీరోయిన్ వస్తుంది కదా అంటూ కొందరు లాజిక్కు తీస్తున్నారు. అసలు విషయం ఏంటీ అంటే ఈ సినిమా కోసం షిర్లీ సెటియా తీసుకుంటున్న పారితోషికం రూ.35 లక్షలు మాత్రమే అంటూ యూనిట్ సభ్యులు అనధికారికంగా మీడియాకు క్లారిటీ ఇచ్చారు.