సుశాంత్ తండ్రికి కోర్టులో చుక్కెదురు

nusratjబాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పూత్ మరణం తర్వాత ఆయన జీవిత కథ ఆధారంగా పలు సినిమాలు మరియు వెబ్ సిరీస్ లను తెరకెక్కించేందుకు ఫిల్మ్ మేకర్స్ సిద్దం అయ్యారు. అందులో భాగంగా ఇప్పటికే రెండు సినిమాలు విడుదలకు సిద్దం అయ్యాయి. తన కొడుకు జీవిత చరిత్ర సినిమాను తమ అనుమతి లేకుండా సుశాంత్ జీవితాన్ని వక్రీకరిస్తూ తీసిన సినిమాల విడుదల అడ్డుకోవాలంటూ కృష్ణ కిషోర్ సింగ్ ఢిల్లీ హై కోర్టును ఆశ్రయించాడు. సుశాంత్ సింగ్ తండ్రి వేసిన స్టే పిటీషన్ ను కోర్టు కొట్టి వేసింది.

సుశాంత్ సింగ్ రాజ్ పూత్ జీవితంతో సంబంధం లేకుండా కల్పిత కథలతో తాము సినిమా తీస్తున్నట్లుగా వారు చెప్పడంతో పాటు ఎలాంటి వివాదాస్పద అంశాలను కూడా తాము చూపించబోవడం లేదు అంటూ సదరు సినిమాలను నిర్మిస్తున్న నిర్మాతలు మరియు దర్శకులు కోర్టుకు తెలియజేయడంతో విడుదల పై స్టే ఇచ్చేందుకు కోర్టు నో చెప్పింది. సుశాంత్ కథ కాకుండా మరో కథతో సినిమాలు చేస్తూ కూడా అనధికారికంగా సుశాంత్ బయోపిక్ అంటూ ప్రచారం చేసుకుంటున్నారంటూ కొందరు ఆరోపిస్తున్నారు.

ఈ విషయమై సుశాంత్ సింగ్ సోదరి స్పందిస్తూ.. ఈ విషయాన్ని కొందరు క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. చనిపోయిన సుశాంత్ జీవితాన్ని మరింతగా రాద్దాంతం చేయడం భావ్యం కాదని.. సినిమాలను విడుదల చేయవద్దంటూ ఆమె కోరింది. కాని ఆయన అభిమానులు మాత్రం సుశాంత్ బయోపిక్ ను కోరుకుంఉటన్నారు. ఆయన జీవితాన్ని వెండి తెరపై చూడాలని ఆశ పడుతున్నారు. మరి కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. కాని సుశాంత్ తండ్రి కృష్ణ కిషోర్ సింగ్ పై కోర్టుకు ఏమైనా వెళ్తాడేమో చూడాలి.