ప్లాన్ చేంజ్ – పుష్ప ఆపేదే లేదంటున్న అల్లు అర్జున్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న తాజా చిత్రం పుష్ప. ఈ సినిమా షూటింగ్ మార్చ్ లోనే మొదలుకావాలి కానీ కరోనా పరిస్థితుల నేపథ్యంలో షూటింగ్ వాయిదా పడుతూ గత నెలలో మొదలైన విషయం తెల్సిందే. ఆంధ్రప్రదేశ్ లోని మారేడుమిల్లి అడవుల్లో ఈ సినిమా షూటింగ్ మొదలైంది.

మొదట్లో సాఫీగానే సాగినా సెట్స్ లో ఒక వ్యక్తికి కరోనా సోకడంతో అర్ధాంతరంగా ఈ మూవీ షూటింగ్ ను ఆపేసి హైదరాబాద్ వచ్చేయాల్సి వచ్చింది. ఇంకా మారేడుమిల్లిలో ఐదు రోజుల షూటింగ్ పెండింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆ షెడ్యూల్ ఇప్పట్లో మొదలయ్యే అవకాశాలు లేవు.

అయితే పుష్ప నెక్స్ట్ షెడ్యూల్ మాత్రం హైదరాబాద్ లో మొదలవుతున్నట్లు సమాచారం. డిసెంబర్ 13 నుండి హైదరాబాద్ శివార్లలో ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు. ఇప్పటికే నటీనటుల డేట్స్ ను లాక్ చేసినట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ ఇటీవలే నిహారిక పెళ్లి కోసం రాజస్థాన్ వెళ్లగా ఈరోజు రిటర్న్ అయ్యాడు.

రష్మిక మందన్న పుష్పలో హీరోయిన్ గా నటిస్తోన్న విషయం తెల్సిందే. అలాగే సుకుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. మైత్రి మూవీస్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.