రిలీజ్ డేట్ల ప్రకటనల్లో దర్శకుల హస్తం లేదా?

ఎస్ ఎస్ రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ చిత్రాన్ని అక్టోబర్ 13న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ విషయంపై నిర్మాత బోనీ కపూర్ ఫైర్ అయ్యాడు. రాజమౌళిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అయితే రాజమౌళి మాత్రం సింపుల్ గా ఈ విషయంలో నాదేం లేదు, అంతా నిర్మాతదే. రిలీజ్ డేట్ ను ఫైనల్ చేసింది ఆయనే అంటూ సైడ్ అయిపోయాడు.

ఇక సుకుమార్ కూడా రిలీజ్ డేట్ విషయంలో నిర్మాతదే తుది నిర్ణయం అని చెప్పేసాడు. ఇటీవలే షూటింగ్ ప్రారంభమైన పుష్పను ఆగస్ట్ 13న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. సుకుమార్ స్టయిల్ తెలిసి కూడా ఇంత త్వరగా రిలీజ్ డేట్ ను ఎలా ఫైనల్ చేసారు అని అడిగితే సుకుమార్ తెలివిగా నిర్మాతను అడగండి అంటున్నాడు.

టాప్ దర్శకులైన రాజమౌళి, సుకుమార్ వంటి వారు రిలీజ్ డేట్ విషయంలో నిర్ణయం తీసుకోవట్లేదా? లేక కావాలని సేఫ్ గేమ్ ఆడుతున్నారా?