ఈసారి కార్తికేయతో ‘ఉప్పెన’ కు సుకుమార్ రెడీ


స్టార్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ తన శిష్యులను దర్శకులుగా పరిచయం చేస్తూ తాను కథ స్క్రీన్‌ ప్లే అందిస్తూ నిర్మిస్తున్న సినిమాలు మంచి విజయాలను దక్కించుకుంటున్నాయి. ఇటీవల వచ్చిన ఉప్పెన ఆ కోవకు చెందినదే. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ఉప్పెన సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఉప్పెన సినిమాకు స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వ పర్యవేక్షణ సుకుమార్‌ అందించారు. దాంతో ఉప్పెన భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అందుకే సుకుమార్ తో కలిసి సినిమా చేయాలని చాలా మంది నిర్మాతలు ఆశ పడుతున్నారు. ఇప్పుడు సుకుమార్ రైటింగ్స్ నుండి కొత్త సినిమాకు రంగం సిద్దం అయ్యింది.

సుకుమార్‌ కథ, స్క్రీన్‌ప్లే మాటలు అందిస్తూ నిర్మిస్తున్న సినిమా లో కార్తికేయ హీరోగా నటించబోతున్నాడు. ఆర్‌ఎక్స్ 100 సినిమాతో హీరోగా గుర్తింపు దక్కించుకున్న కార్తికేయ ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మెప్పించాడు. వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న కార్తికేయ త్వరలో చావు కబురు చల్లగా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సమయంలో సుకుమార్ రైటింగ్స్ లో కార్తికేయ సినిమా అధికారిక ప్రకటన వచ్చింది. ఈ సినిమా కు దర్శకుడు ఎవరు నిర్మాణ సంస్థ ఏంటీ అనే పూర్తి వివరాలు అతి త్వరలో రాబోతున్నట్లుగా ప్రకటించారు. మొత్తానికి ఈ ప్రాజెక్ట్‌ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.