ఫాదర్స్ డే రోజున ఎమోషనల్ అయిన సురేఖ వాణి కూతురు

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది క్యారెక్టర్ నటి సురేఖా వాణి కూతురు సుప్రీతా. తన తల్లితో లేదా సోలోగా సోషల్ మీడియాలో పోస్ట్, రీల్స్ పెట్టి తన ఫాలోయర్స్ ను ఎంటర్టైన్ చేస్తుంటుంది. అవసరాన్ని బట్టి గ్లామరస్ గా కనిపించడానికి పైగా వెనుకాడని సుప్రీతా, ఈరోజు ఎమోషనల్ అయింది.

ఈరోజు ఫాదర్స్ డే అన్న విషయం తెల్సిందే. అయితే సురేఖ వాణి భర్త, సుప్రీతా తండ్రి సురేష్ తేజ ఈ లోకాన్ని విడిచి రెండేళ్లు అవుతోంది. ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా సుప్రీతా ఎమోషనల్ అయింది.

“నా ఫస్ట్ హీరో హ్యాపీ ఫాదర్స్ డే. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ప్రతీసారి ఫాదర్స్ డే ఇంత నొప్పి కలిగిస్తుందని నేను ఊహించలేదు. ఏదో ఒకటి చేసి వచ్చేయవా. నా చివరి శ్వాస వరకూ నీ గురించి ఎదురుచూస్తాను. నువ్వు ఎక్కడో ఒక చోట నుండి ఎదురుచూస్తూ ఉంటావని నాకు తెలుసు” అని సుప్రీతా పోస్ట్ పెట్టింది.