సురేష్‌ ప్రొడక్షన్స్‌ వారి మ్యూజిక్ బిజినెస్‌

టాలీవుడ్‌ లో దిగ్గజ నిర్మాణ సంస్థ సురేష్‌ ప్రొడక్షన్స్‌ వారు. 50 ఏళ్ల సినిమా నిర్మాణ రంగంలో ఉన్న సురేష్‌ ప్రొడక్షన్స్‌ వారు కొత్తగా మ్యూజిక్ రంగంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఎస్‌ పీ మ్యూజిక్‌ అనే పేరుతో ఇకపై మ్యూజిక్ కంపెనీని ఏర్పాటు చేయబోతున్నారు. తెలుగు సినిమా పాటలు ఎక్కువగా ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల అవుతాయి. ఇప్పుడు ఎస్‌ పీ కూడా రంగంలోకి దిగుతున్న నేపథ్యంలో పోటీ మరింత రసవత్తరంగా మారే అవకాశం ఉంది. సినిమా ల క్రేజ్ ను బట్టి పది లక్షల నుండి మొదలుకుని రెండు మూడు కోట్ల వరకు మ్యూజిక్‌ కు రేటు పలుకుతుంది.

సినిమా నిర్మాణంలో అనుభం ఉన్న సురేష్‌ ప్రొడక్షన్స్‌ వారు ఈ రంగంలో రాణించడం ఖాయం అంటున్నారు. 50 ఏళ్లు ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలను నిర్మించిన సురేష్‌ ప్రొడక్షన్స్‌ వారు ఇప్పటికే ఏపీ మరియు తెలంగాణలో స్టూడియోలను కూడా నిర్వహిస్తున్నారు. ఇండస్ట్రీకి సుదీర్ఘ కాలంగా సేవలు అందిస్తున్న రామానాయుడు కుటుంబం ఇప్పుడు సంగీతంను కూడా ప్రేక్షకులకు అందించేందుకు సిద్దం అవ్వడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.