ఆకాశం నీ హద్దురా ఈ ఐదు రికార్డులను కొల్లగొట్టింది!

సూర్య నటించిన ఆఖరి చిత్రం ఆకాశం నీ హద్దురా. డైరెక్ట్ ఓటిటిలో విడుదలైన ఈ చిత్రం రికార్డులను తిరగరాసింది. అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా విడుదలైంది. అప్పటినుండి దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది. ఆస్కర్స్ కు కూడా పోటీ పడింది ఆకాశం నీ హద్దురా.

ఇదిలా ఉంటే ఈ చిత్రం ఐదు రికార్డులను తుడిచిపెట్టిందని ప్రధానంగా చర్చించుకుంటున్నారు. అవేమిటంటే ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతోన్న ఈ చిత్రం పాండెమిక్ సమయంలో ఎక్కువగా చూసిన చిత్రంగా రికార్డు సృష్టించింది. అలాగే అమెజాన్ ప్రైమ్ కు అత్యధిక ప్రాఫిట్స్ అందించిన సౌత్ ఇండియన్ చిత్రమిది.

ఐఎండిబి రేటింగ్స్ ప్రకారం 9.1 తో టాప్ రేటెడ్ ఇండియన్ మూవీగా ఇది నిలిచింది. వరల్డ్ వైడ్ గా మూడో స్థానంలో ఉంది. మోస్ట్ ట్రెండ్ సౌత్ ఇండియన్ మూవీగా ట్విట్టర్ లో రికార్డు క్రియేట్ చేసింది. అత్యధికంగా సెర్చ్ చేసిన సౌత్ ఇండియన్ మూవీగా ఆకాశం నీ హద్దురా గూగుల్ లో రికార్డు సృష్టించింది.