సుశాంత్ సింగ్ రాజ్ పూత్ మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న బాలీవుడ్ హీరోయిన్ రియా చక్రవర్తి గత ఏడాది కాలంగా ఒక్కటి అంటే కనీసం ఒక్క సినిమా ఆఫర్ ను దక్కించుకోలేదు. ఆమెపై సినీ జనాల్లో సానుభూతి ఉన్నా కూడా జనాల్లో మాత్రం వ్యతిరేకత ఉందని ఇన్నాళ్లుగా ఆమెకు ఆఫర్లు ఇవ్వలేదు. ఎట్టకేలకు బాలీవుడ్ మెగా స్టార్ అమితాబచ్చన్ సినిమాలో ఈమెకు ఛాన్స్ దక్కింది. బిగ్ బి మూవీ అవ్వడం వల్ల ఎవరు పెద్దగా విమర్శలు చేసే అవకాశం లేదని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.
అమితాబచ్చన్, ఇమ్రాన్ హష్మిలు కలిసి నటిస్తున్న ‘చెహ్రే’ సినిమాలో హీరోయిన్ పాత్రకు గాను ఎంతో మంది ముద్దుగుమ్మలను పరిశీలించి చివరకు రియా చక్రవర్తిని ఎంపిక చేయడం జరిగింది. సుశాంత్ మృతి కేసు నుండి డ్రగ్స్ కేసుకు వివాదం మరలడం డ్రగ్స్ కేసులో రియా అరెస్ట్ అవ్వడం ఆమెకు బెయిల్ మంజూరు చేసేందుకు కోర్టు నిరాకరించడంతో చాలా రోజుల పాటు ఆమె జైలు జీవితంను గడపడం వంటి కారనాల వల్ల ఆమె కెరీర్ నాశనం అయ్యిందని అంతా భావించారు. కాని అనూహ్యంగా మెగాస్టార్ సినిమాలో ఆఫర్ రావడంతో ఆమె జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత కెరీర్ ను పునః ప్రారంభించబోతుంది.