అఖిల్ – జైనాబ్ : జంట బావుంది.. పెళ్లి తేదీ ఖరారైందా?
అక్కినేని నాగచైతన్య- శోభిత జంట వివాహం ఇటీవల రెగ్యులర్ గా మీడియా హెడ్ లైన్స్ లో నిలిచిన టాపిక్. ఇంతలోనే అక్కినేని అఖిల్- జైనాబ్ రావ్ జీ జంట పెళ్లి గురించి అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ జంట నిశ్చితార్థం ఇప్పటికే పూర్తయింది. త్వరలోనే వివాహ తేదీ గురించిన అధికారిక ప్రకటన వెలువడుతుందని అంతా ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఇంతకుముందు అఖిల్ నిశ్చితార్థం నుంచి అద్భుతమైన ఫోటోలను షేర్ చేశారు నాగార్జున. అవన్నీ అంతర్జాలంలో వైరల్ అయ్యాయి. […]