ఆ హీరోయిన్ కి తోడుగా ఎవ్వరూ లేరా?
బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ మండి నియోజక వర్గం నుంచి బీజేపీ తరుపున ఎంపీ అభ్యర్ధిగా బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. ప్రచారంలో భాగంగా నియోజక వర్గంలో విస్తృతంగా తిరుగుతున్నారు. ఎంపీ గా గెలిచి పార్లమెంట్ లో మొట్ట మొదటి సారి కాలు మోపాలని తన వంతు ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. కానీ ఆమెకి మద్దతుగా మాత్రం బాలీవుడ్ పరిశ్రమ నుంచి ఏ ఒక్కరు నిలబడిన వైనం కనిపించలేదు. కనీసం సోషల్ మీడియాలో కూడా ఎవరూ మద్దతు ప్రకటించలేదు. […]