‘అప్పు’ తెస్తున్నారు.. అంతేనా.? హోదా ఏమైనా తెచ్చేశారా.?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో 10 వేల కోట్ల రూపాయలు అప్పు చేసుకునేందుకు కేంద్రం అనుమతిచ్చిందట. ఈ మేరకు రిజర్వు బ్యాంకుకి కేంద్రం సమాచారమిచ్చిందట. రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ గత కొద్ది రోజులుగా ఢిల్లీలో మకాం వేసి సాధించిన ఘనకార్యమిది. రాష్ట్రంలో విపక్షాలు, యెల్లో మీడియా కలిసి.. రాష్ట్రానికి అప్పు పుట్టనీయకుండా కుట్ర పన్నుతున్నాయనీ, ఆ కుట్రలు భగ్నమయ్యాయనీ, ఆర్థిక మంత్రి బుగ్గన సంచలన విజయం సాధించారనీ, ‘బులుగు కార్మికులు’ బీభత్సమైన ఎలివేషన్లు ఇస్తున్నారు. విపక్షాలు […]

ఆ అప్పులకీ.. ఈ అభివృద్ధికీ సంబంధమేంటి బుగ్గన సారూ.!

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ విద్యాధికుడే.. అంతకు మించిన మాటకారి ఆయన. తిమ్మిని బమ్మిని చేయగల మేధావి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా అప్పులు చేస్తోందన్నది విపక్షాల ఆరోపణ. ఈ విషయమై టీడీపీ నేత, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ ఆధారాలతో సహా కొన్ని ఆరోపణలు చేశారు. ఏపీఎస్‌డీసీ చేసిన అప్పుల్ని గుట్టుగా వుంచుతున్నారనీ, వాటిని ఏ విధంగా తిరిగి చెల్లిస్తారన్నది చెప్పడంలేదనీ, కొన్ని ఖర్చులకి సరైన లెక్కలూ వుండడంలేదనీ […]

రేణిగుంట ఎయిర్ పోర్టులో మంత్రి బుగ్గనకు అవమానం

మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి అవమానం జరిగింది. తిరుపతి విమానాశ్రయంలో రన్ వేకు వెళ్లే రెండో వీఐపీ గేట్ వద్ద ఆయన్ను కేంద్ర భద్రత సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో పీయూష్ గోయల్‌కు బుగ్గన వీడ్కోలు పలకలేకపోయారు. తాను రాష్ట్ర మంత్రిని అని చెప్పినా సిబ్బంది వినకుండా తోసేసినట్టు తెలుస్తోంది. తిరుమల పర్యటన అనంతరం పియూష్ గోయల్ తిరిగి వెళ్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. మంత్రి సెక్యూరిటీ ఎంత చెప్పినా లిస్టులో పేరు లేనందువల్ల పంపలేమని విమానాశ్రయ […]