షాకింగ్: హుజూరాబాద్ కాంగ్రెస్ నేత ఆడియో లీక్..! టీపీసీసీ నోటీసులు

ఓపక్క హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రకటన రాకముందే టీఆర్ఎస్-బీజేపీ మధ్య రాజకీయాలు హీటెక్కాయి. ఇప్పుడు నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి కౌశిక్ రెడ్డి ఫోన్ సంభాషణ దానిపై అగ్గి రాజేస్తోంది. కాంగ్రెస్ నేత అయిన కౌశిక్ రెడ్డి హుజూరాబాద్ ఉప ఎన్నికలో తనకు టీఆర్ఎస్ టికెట్ కన్ఫర్మ్ అయిందంటూ ఉన్న ఆడియో టేప్ లీకై సంచలనం రేపుతోంది. దీంతో కాంగ్రెస్ సీరియస్ అయి ఆయనకు షోకాజ్ నోటీస్ కూడా జారీ చేసింది. ‘టీఆర్ఎస్ టికెట్ నాకే కన్ఫర్మ్ అయింది. […]