ప్రభాస్ ‘ఫౌజీ’… మెగా ‘విశ్వంభర’ లింక్ ఏంటి?
సలార్, కల్కి సినిమాల సూపర్ హిట్ నేపథ్యంలో ప్రభాస్ తదుపరి సినిమాలపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఇప్పటికే మారుతి దర్శకత్వంలో ప్రభాస్ ‘రాజాసాబ్’ సినిమాను చేస్తున్నాడు. వచ్చే ఏడాది ఆరంభంలోనే రాజాసాబ్ సినిమాను విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. మరో వైపు సీతారామం వంటి సూపర్ హిట్ సినిమాను అందించిన దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో కూడా ప్రభాస్ ఒక సినిమా ను చేయబోతున్నాడు. ఆగస్టు 17న సినిమా ప్రకటన ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. […]