ఆ ఇబ్బంది ఉన్నా… దేశం మొత్తం పర్యటిస్తా: సామ్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం శాకుంతలం. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో శకుంతల దుష్యంతుల ప్రేమకథతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక శాకుంతలంలో మలయాళ నటుడు దేవ్ మోహన్ దుష్యంతుడిగా నటిస్తున్నాడు.ఇప్పటికే విడుదలైన ట్రైలర్స్ పాటలకు మంచి స్పందన వచ్చింది. ఇక ఈ చిత్రం పాన్ ఇండియా కథాంశంతో వస్తోంది. ఏప్రిల్ 14న తెలుగు తమిళ్ కన్నడ మలయాళ హిందీ భాషల్లో ఏకకాలంలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది. […]