రామోజీకి నివాళిగా టాలీవుడ్ బంద్

తెలుగు చిత్ర‌సీమ‌కు రామోజీరావు సేవ‌లు అనిత‌ర సాధ్య‌మైన‌వి. ఆయ‌న సినీనిర్మాత‌గా బుల్లితెర (ఈటీవీ సంస్థ‌లు) కార్య‌క్ర‌మాల క‌ర్త‌గా వినోద‌రంగంలో ల‌బ్ధ ప్ర‌తిష్ఠులు. అన్నిటికీ మించి నిత్యం ప‌దుల సంఖ్య‌లో షూటింగులు జ‌రుపుకోవ‌డానికి అనుకూల‌మైన‌ రామోజీ ఫిలింసిటీ నిర్మాణ క‌ర్త‌గా ఆయ‌న‌కు గొప్ప గౌర‌వం ఉంది. అందుకే ఆయ‌న నిష్కృమ‌ణాన్ని టాలీవుడ్ జీర్ణించుకోలేక‌పోతోంది. ”రామోజీ రావు గారు మరణించిన కారణంగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ రేపు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో నిలుపవేయబడుతుంది” అంటూ తాజాగా తెలుగు నిర్మాత‌ల సంఘం […]