యానిమ‌ల్ బ్యూటీ.. కాబోయేవాడు ఇలా ఉండాలి

సందీప్ రెడ్డి వంగా `యానిమల్` చిత్రంలో రణబీర్ సరసన నటించింది ట్రిప్తి డిమ్రీ. ఓవ‌ర్ నైట్ లో అసాధార‌ణ‌ పాపులారిటీ సంపాదించింది. అప్పటి నుండి ఈ బ్యూటీ వెంట‌ప‌డేవాళ్లు ఎక్కువ‌య్యారు. సూట్ కేసుల‌తో నిర్మాత‌లు అడ్వాన్సులు అందిస్తున్నారు. కొత్త ప్రాజెక్టుల‌కు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. ఇటీవ‌ల బ్యాడ్ న్యూజ్ లో న‌టించింది. ఈ సినిమా కూడా చెప్పుకోద‌గ్గ విజ‌యం సాధించింది. మునుముందు వ‌రుస‌గా సినిమాలు రిలీజ్ కానున్నాయి. వీటిలో ట్రిప్తీ గ్లామ‌ర్‌ షో పై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. […]