వంశీ పైడిపల్లి బాలీవుడ్ ఎంట్రీ.. స్టార్ తో క్రేజీ ప్రాజెక్ట్
తెలుగు సినీ పరిశ్రమ నుంచి పలువురు దర్శకులు బాలీవుడ్‌లో సత్తా చాటుతుండటంతో, ఇప్పుడు వంశీ పైడిపల్లి కూడా అదే దిశగా అడుగులు వేస్తున్నారు. టాలీవుడ్‌లో కొన్ని హిట్ చిత్రాలు తెరకెక్కించిన వంశీ పైడిపల్లి, తన “వారసుడు” చిత్రం తర్వాత నుంచి కొత్త ప్రాజెక్ట్ ప్రకటించకపోయినా, ఈసారి బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఇటీవలే అట్లీ “జవాన్”తో బాలీవుడ్‌లో సంచలన విజయం సాధించగా, సందీప్ రెడ్డి వంగా కూడా “కబీర్ సింగ్”తో బాలీవుడ్‌లో ఘనవిజయం అందుకున్నాడు. […]