నితిన్ సినిమాలో బోల్డ్ రోల్ కు ఎంపికైన మిల్కీ బ్యూటీ


యంగ్ హీరో నితిన్ హీరోగా బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా అంధధూన్ రీమేక్ అవుతోన్న విషయం తెల్సిందే. ఈ సినిమాను డైరెక్ట్ చేయడానికి మేర్లపాక గాంధీను ఎంచుకున్నారు. అంధధూన్ సినిమా నచ్చడంతో నితిన్ ఏరికోరి ఈ చిత్రాన్ని చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర కన్నా టబు పోషించిన పాత్ర సినిమాకు ఎంతో కీలకం. అది బోల్డ్ రోల్ అవ్వడమే కాకుండా సినిమాకు ఎంతో కీలకమైనది కూడా.

అంధధూన్ రీమేక్ కు టబు పాత్రలో ఎవరిని ఎంచుకోవాలన్న సందేహం కూడా నితిన్ అండ్ టీమ్ కు పెద్ద ప్రశ్నలా మిగిలింది. ముందుగా టబునే ఈ రోల్ కు అనుకున్నారు. ఆమె నో చెప్పడంతో తర్వాత చాలా మంది పేర్లను పరిశీలించారు. ఎంతో మందిని అప్రోచ్ అయ్యారు. అయితే ఆ పాత్రకు సరైన వాళ్ళు సెట్ అవ్వలేదు.

అయితే ఇప్పుడు ఈ చిత్రం విషయంలో అధికారిక ప్రకటన వచ్చింది. అంధధూన్ రీమేక్ లో టబు పోషించిన పాత్రను తమన్నా ఇక్కడ వేయనుంది. ఇక హీరోయిన్ గా నభా నటేష్ పేరును కన్ఫర్మ్ చేసారు. మహతి స్వర సాగర్ స్వరాలు సమకూరుస్తాడు. ఈ చిత్రాన్ని నవంబర్ నుండి మొదలుపెడతారని అధికారికంగా ప్రకటించారు.