స్టార్ హీరోకి ప్రయివేట్ మెసేజ్ పెట్టి దొరికిపోయిన తాప్సీ!

టాలీవుడ్ నుంచి కోలీవుడ్ కి అట్నుంచి బాలీవుడ్ కి వెళ్లి సెటిలైంది తాప్సీ. ఇటీవలి కాలంలో హిందీ చిత్రసీమపైనే పూర్తిగా దృష్టి సారించింది. అడపాదడపా తెలుగులో నటిస్తున్నా తన టార్గెట్ మాత్రం బాలీవుడ్ లో టాప్ నాయికగా ఎదగడమే. కొంతవరకూ తాప్సీ పన్ను సఫలమైంది. ప్రస్తుతం కెరీర్ పరంగా క్షణం తీరిక లేనంత బిజీగా ఉంది.

ఆసక్తికరంగా తాప్సీ పన్ను క్రష్ ఎవరిపైనో తాజాగా రివీలైంది. ఒక స్టార్ హీరోకి తాప్సీ ప్రయివేట్ మెసేజ్ పంపి అడ్డంగా బుక్కయ్యింది. ఆ సంగతి ఇంటా బయటా కూడా ఇప్పుడు తెలిసిపోయింది. ఇంతకీ తాప్సీ మెసేజ్ పెట్టింది ఏ హీరోకి? అసలు ఆ మెసేజ్ లో ఏం ఉంది? అన్నది తెలియాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాలి.

తాప్సీ పన్నూ ఓసారి `అవెంజర్స్ ఎండ్ గేమ్` నటుడు రాబర్ట్ డౌనీ జూనియర్ కి కి ఒక మెసేజ్ పంపిందట. కానీ అతడి నుంచి ఎటువంటి సమాధానం రాలేదని తాప్సీ చెప్పింది. ఇటీవల నెట్ ఫ్లిక్స్ లో తాప్సీ నటించిన హసీన్ దిల్ రూబా రిలీజైన సంగతి తెలిసిందే. ఈ మూవీలో నటించిన తాప్సీకి మంచి పేరొచ్చింది. కాస్త బోల్డ్ సన్నివేశాల్లో నటించానని తెలిపింది.

నెట్ ఫ్లిక్స్ షేర్ చేసిన కొత్త ప్రచార వీడియోలో తాప్సీ పన్నూ ఇలాంటి చాలా విషయాల్ని వెల్లడించింది. ఆమె హసీన్ దిల్ రూబా సహనటుడు విక్రాంత్ మాస్సే తో లై డిటెక్టర్ పరీక్షను చేపట్టారు. నటీనటులు ఒకరినొకరు అనేక ప్రశ్నలు అడిగారు. అందులో విక్రాంత్ ఏ హీరోతో డ్రీమ్స్ లోకి వెళ్లిపోతారు? అని తాప్సీని అడిగారు.

నేను రాబర్ట్ డౌనీ జూనియర్ కు డైరక్ట్ మెసేజ్ చేసాను. కానీ ఆయన సమాధానం ఇవ్వలేదు. అయితే తాప్సీ అతనికి ఏ ప్లాట్ ఫామ్ లో సందేశం పంపించిందో ప్రస్తావించలేదు. తాప్సీ – డౌనీ జూనియర్లకు ట్విట్టర్ – ఇన్ స్టాగ్రామ్ లో ఖాతాలు ఉన్నాయి.

ఇన్ స్టా లో తాప్సీకి సుమారు 18.8 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండగా రిపోర్టింగ్ సమయంలో ట్విట్టర్ లో 4.6 మంది ఫాలోవర్లు ఉన్నారు. మరోవైపు రాబర్ట్ డౌనీ జూనియర్ ఇన్ స్టాగ్రామ్ లో 50.7 మిలియన్లు ఫాలోవర్స్ ఉండగా.. ట్విట్టర్ లో 16.4 మిలియన్ల మంది ఫాలోవర్లను కలిగి ఉన్నారు.

తాప్సీ పన్ను.. విక్రాంత్ ను గూగుల్ చేస్తావా? అని అడిగింది. కానీ అతను తిరస్కరించగా.. అబద్ధం చెబుతున్నాడని యంత్రం అప్రమత్తమైంది. తాప్సీ- విక్రాంత్ ఒకరినొకరు మరికొన్ని ప్రశ్నలు అడగడం కొనసాగించారు. ప్రస్తుతం ఈ వీడియో అంతర్జాలంలో వైరల్ గా మారింది.

తాప్సీ తాజాగా ఒక సినీ విమర్శకుడిపై అసభ్యకరమైన భాషతో ట్వీట్ చేసింది. తనని సదరు విమర్శకుడు వ్యక్తిగతంగా టార్గెట్ చేశాడని కూడా సీరియస్ అయ్యింది. `హసీన్ దిల్ రూబా` టాక్సిక్ మస్క్యూలిన్ లవ్ ను కీర్తిస్తున్నారా? అని విమర్శకులు హైలైట్ చేసిన తరువాత తాప్సీ తన సినిమాను డిపెండ్ చేసుకుంది.

లోపభూయిష్ట పాత్రను మరొక లోపభూయిష్ట వ్యక్తులు చూపించడాన్ని గ్లోరిఫికేషన్ అంటారు. ఒకవేళ మీరు అలా చేస్తే దాని పరిణామాలు కూడా తీవ్రంగానే ఉంటాయి. అవగాహన మనిషిని హీరోని చేస్తుంది కానీ `రెండు పాత్రలను బాధపెట్టింది`.. విమర్శకులదే తప్పు..!! అంటూ ఆమె ట్వీట్ చేసింది. తన సినిమాని డిపెండ్ చేసుకుంది.

తాప్సీ బహు భాషలలో సినిమాలు చేయడానికి సంసిద్ధంగా ఉంది. ప్రస్తుతం తెలుగు చిత్రం- మిషన్ ఇంపాజిబుల్ షూటింగ్ లో బిజీగా ఉంది. హసీన్ దిల్ రూబా ఇటీవల విడుదల కాగా.. 2021 లో లూప్ లాపెటా- రష్మి రాకెట్- దూబారా రిలీజ్ బరిలో ఉన్నాయి.