తెలుగమ్మాయి మత్తెక్కించేస్తోంది.. వ్వాటే లుక్స్


తెలుగు అమ్మాయిలు గ్లామరస్ పాత్రలు చేయరు అని అపోహలకు నేటితరం అమ్మాయిలు చాలా గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. సోషల్ మీడియాలో వారి సరికొత్త గ్లామర్ ను ప్రజెంట్ చేస్తున్నారు. గత కొంత కాలంగా హైదరాబాద్ బ్యూటీ ఈషా రెబ్బ కూడా తనలోని సరికొత్త గ్లామర్ తో ఫాలోవర్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఆమె ఎలాంటి ఫోటో పోస్ట్ చేసినా కూడా నిమిషాల్లోనే ఇంటర్నెట్ ప్రపంచంలో వేగంగా వైరల్ అవుతున్నాయి.

ఇక రీసెంట్ గా కూడా మరోసారి బ్లాక్ అండ్ వైట్ ఫోటోలను పోస్ట్ చేసి సరికొత్తగా ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. వేసుకున్న చొక్కాను స్వేచ్ఛగా వదిలేసి అమ్మడు ఎద అందాలను కూడా కాస్త అందంగా ప్రజెంట్ చేసింది.ఇక మత్తెక్కించే చూపులతో కూడా ఈ ఫోటోకి డిఫరెంట్ గా స్టిల్ అయితే ఇచ్చింది. అన్ని తరహా పాత్రలు చేయడానికి సిద్ధమేనని ఈ బ్యూటీ ఒక విధంగా ఈ ఫోటోలతో చెప్పకనే చెబుతోంది.

అయితే మధ్యలో ఈషాకు కొన్ని గ్లామరస్ పాత్రలు చేసే అవకాశం వచ్చినప్పటికీ కూడా అందులో కంటెంట్ బలంగా లేకపోవడం తో ఆమె ఒప్పుకోలేదట. గ్లామరస్ పాత్రలు చేయాలి అంటే కథలో బలమైన కంటెంట్ ఉంటేనే నటించడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా లో మొదట ఒక చిన్న గెస్ట్ పాత్రలో కనిపించి అతి తక్కువ కాలంలోనే కొన్ని చిన్న సినిమాలతో మంచి గుర్తింపు అందుకుంది.

కేవలం తెలుగులోనే కాకుండా తమిళం మలయాళం సినిమాల్లో నటించే ప్రయత్నం చేస్తోంది. చివరగా ఈషా రెబ్బా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో కనిపించిన విషయం తెలిసిందే. ఆ మధ్య నెట్ ఫ్లిక్స్ పిట్టకథలు వెబ్ సీరీస్ లో ఒక డిఫరెంట్ క్యారెక్టర్లో కనిపించింది.

కానీ అదేమీ అంతగా వర్కవుట్ కాలేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ఒక మలయాళం సినిమా అలాగే తెలుగులో మరొ రెండు సినిమాలు కూడా చర్చల దశలో ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి ఆ సినిమాలు ఎంత వరకు సక్సెస్ అవుతాయో చూడాలి.