నా కష్టమే వాటికీ సమాధానం చెబుతుంది: మిల్కీబ్యూటీ హాట్ కామెంట్స్

ఈ మధ్యకాలంలో తెలుగు ప్రేక్షకులకు థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసే అవకాశం సరిగ్గా రాలేదు. డిసెంబర్ లో థియేటర్స్ ఓపెన్ అయినప్పటికి ఫిబ్రవరిలో థియేటర్లకు 100% అక్యూపెన్సీ లభించింది. కానీ థియేటర్స్ రన్ అవుతూ నెలరోజులు గడవకముందే మళ్లీ కరోనా సెకండ్ వేవ్ ముంచుకొచ్చింది. అంతే థియేటర్స్ మళ్లీ మూతపడటం మొదలైంది. కానీ ఏడాది కాలంగా థియేటర్స్ ఉన్నా లేకున్నా జనాలు మాత్రం సినిమాలు చూడటం ఆపలేదు. ఎందుకంటే అందుబాటులో ఓటిటిలు ఉన్నాయి కదా. అందులో భాగంగానే తెలుగు ప్రేక్షకులకు సినిమాలు వెబ్ సిరీసులు ప్రోగ్రాంలు అందుబాటులో ఉన్నాయి.

అయితే తాజాగా స్టార్ హీరోయిన్ తమన్నా ‘లెవెన్త్ అవర్’ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ట్రైలర్ వరకు ఆకట్టుకున్నా వెబ్ సిరీస్ విడుదలయ్యాక మాత్రం ఆకట్టుకోలేకపోయింది. తమన్నాను చూసి అట్రాక్ట్ అయినప్పటికీ లెవెన్త్ అవర్ మాత్రం ప్రేక్షకుల మెప్పు పొందలేదు. ఇప్పటివరకు ఆహాలో భారీ బడ్జెట్ తో నిర్మించిన వెబ్ సిరీస్ ఇదే కావడం విశేషం. కానీ ఫలితం ఎలా ఉన్నప్పటికీ ఆహా బృందం మాత్రం పాజిటివ్ గానే ముందుకు సాగుతుంది. తమన్నా గ్లామర్ బ్యూటీ కాబట్టి ఆమెతో మరో ఇంటరెస్టింగ్ వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తుందట ఓటిటి. అయితే ఇటీవలే నవంబర్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ చేసింది.

అయితే లెవెన్త్ అవర్ వెబ్ సిరీస్ ఫెయిల్ అవ్వడంతో తమన్నా పై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. వేరే స్టార్ హీరోయిన్స్ ఆల్రెడీ మంచి ప్రాజెక్ట్ లతో పాపులర్ అవుతుండగా మరి మిల్కీ బ్యూటీ తమన్నా ఎందుకు ఇంకా సాలిడ్ సక్సెస్ అందుకోలేదని ఫ్యాన్స్ వాపోతున్నారు. కానీ ఇలాంటి పుకార్లకు – ట్రోల్స్ కు తమన్నా ఏమాత్రం కేర్ చేయనని అంటోంది. ఎందుకంటే.. తమన్నాకు ఇతరులతో పోలికలు అనేవి నచ్చదట. అందుకే ఇతరుల సక్సెస్ గురించి తన ఫెయిల్యూర్స్ గురించి తాను పట్టించుకోను అంటోంది అమ్మడు. తమన్నా ఓటిటిలో అదిరిపోయే యాక్షన్ ట్రీట్ ఇస్తుంది. కానీ ఆ ప్రయత్నం ఫెయిల్ అవ్వడంతో ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. కేవలం తన పని కష్టం మాత్రమే ఇలాంటి పుకార్లకు సమాధానం చెబుతాయని అమ్మడు తేల్చి చెప్పేస్తోంది. త్వరలోనే మిల్కీబ్యూటీ టాక్ షోతో రాబోతుందని సమాచారం.