‘నన్ను వాడుకుని మోసం చేసాడు..’ మాజీ మంత్రిపై సినీ నటి ఆరోపణలు..!

తమిళనాడులో గత ప్రభుత్వ హయాంలో ఐటీ మంత్రిగా పని చేసిన మణికందన్ పై సీనీ నటి చాందిని లైంగిక ఆరోపణలు చేసింది. ఈమేరకు చెన్నై సిటీ పోలిస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘ఓ ప్రైవేట్ ఫంక్షన్ లో ఐదేళ్ల క్రితం కలిశాం. అప్పటినుంచీ ఇద్దరం శారీరకంగా చాలాసార్లు కలిశాం. మూడుసార్లు అబార్షన్ కూడా అయింది. పెళ్లి చేసుకున్నాక పిల్లల్ని కందాం అనేవాడు. ఇప్పుడు పెళ్లి చేసుకుందామంటే రౌడీలతో బెదిరిస్తున్నాడు’.

‘దేశం విడిచి వెళ్లిపోవాలని.. లేదంటే తన ప్రైవేట్ ఫొటోలు, వీడియోలు ఇంటర్నెట్ లో అప్లోడ్ చేస్తానని బెదిరిస్తున్నాడు’ అని ఆరోపించింది. దీనిపై మణికందన్ మాట్లాడుతూ.. ‘ఆమె తప్పుడు ఆరోపణలు చేస్తోంది. ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాను’ అని అన్నారు. చాందిని ‘నోమాడ్స్’ సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. మణికందన్ జయలలిత మంత్రివర్గంలో ఐటీ శాఖ మంత్రిగా పని చేశారు. ఆమె మరణానంతరం శశికళకు ముఖ్య అనుచరుడిగా మారారు.