ఎంత డబ్బైనా ఇస్తా.. నాతో పడుకుంటే అంటూ నటికి మెసేజ్‌

సోషల్‌ మీడియాలో కొన్ని సార్లు హీరోయిన్స్ కు చేదు అనుభవం ఎదురవుతూ ఉంటుంది. చాలా సార్లు బ్యాడ్ కామెంట్స్ వస్తూ ఉంటాయి. కొందరు పర్సనల్‌ గా కూడా దారుణంగా మెసేజ్ లు చేస్తూ ఉంటారు. అత్యంత నీచంగా కొందరు చేసే కామెంట్స్ హీరోయిన్స్‌ కు ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి. అయినా కూడా కొందరు వాటిని పట్టించుకోరు. కాని కొందరు మాత్రం వాటిని సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేసి ఆ బ్యాడ్‌ కామెంట్స్ చేసిన వారిపై రివక్స్ కౌంటర్‌ ఇచ్చి బుద్ది చెప్తారు.

తమిళ నటి సౌందర్య నందకుమార్ సోషల్‌ మీడియాలో చేదు అనుభవం ఎదుర్కొంది. ఒక వ్యక్తి ఏకంగా నీవు అంటే నాకు ఇష్టం నా కోరిక తీర్చుతావా నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తానంటూ ఆఫర్‌ చేశాడు. నిన్ను చూస్తేనే మూడ్‌ వస్తుందని కూడా సౌందర్యను ఉద్దేశించి అతడు కామెంట్స్ చేశాడు. అతడి మెసేజ్ ను సౌందర్య షేర్‌ చేసింది. ఇలాంటి వెదవలను ఏం చేయాలంటూ ప్రశ్నించింది. సోషల్‌ మీడియాలో తాను ఒక లెక్చరర్‌ అని పేర్కొన్న అతడు అత్యంత నీచంగా మాట్లాడిన తీరుకు అంతా కూడా అవాక్కవుతున్నారు.