రియల్ హీరో సోనూసూద్ పై ప్రముఖ ఫిల్మ్ మేకర్ సోనూ సూద్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం సోనూ సూద్ ప్రభుత్వాలు కూడా చేయలేని గొప్ప పనులు చేస్తున్నాడు. ఆయన గురించి మాట్లాడే అర్హత కూడా మనకు లేదు అంటూనే గతంలో జరిగిన ఒక సంఘటన గురించి తమ్మారెడ్డి మాట్లాడుతూ ఆ సమయంలో సోనూసూద్ ఎంత కమర్షియల్ గా వ్యవహరించాడో చెప్పాడు. నాలుగు సంవత్సరాల క్రితం ముచ్చట అంటూ సోనూసూద్ గురించిన విషయాన్ని తమ్మారెడ్డి చెప్పుకొచ్చాడు.
నాలుగు సంవత్సరాల క్రితం వికలాంగుల ఛారిటీ కోసం ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఆ సమయంలో సోనూసూద్ ను ఆహ్వానించగా ఆయన డబ్బులు ఇస్తే వస్తానన్నాడు. దాంతో ఆ సమయంలో నేను ఆయన ఇంత కమర్షియల్ మనిషా అనుకున్నాను. కాని ఇప్పుడు సోనూసూద్ దేవుడు అంటూ వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు దేవుడిగా ఎంతో మందికి సేవ చేస్తున్న ఈ సమయంలో ఆయన గురించి తక్కువ చేసి మాట్లాడేందుకు తమ్మారెడ్డి ఉద్దేశ్యం ఏంటీ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.