డ్రగ్స్ కేసులో హీరో తనీష్‌ కు పోలీసులు నోటీసులు

బెంగళూరు డ్రగ్స్ రాకెట్‌ వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్‌ కు కూడా చేరింది. డ్రగ్స్‌ తో మొదట ఇద్దరు విదేశీయులను అరెస్ట్‌ చేసిన పోలీసులు తీగ లాగితే డొంక కదిలినట్లుగా మొత్తం వ్యవహారం బయటకు వస్తుంది. విదేశీయులు ఇచ్చిన వివరాలను బట్టి మస్తాన్‌ మరియు విక్కీ మల్హోత్రా లను అదుపులోకి తీసుకున్నారు. వారి ద్వారా మరి కొందరు కూడా బయటకు వచ్చారు. మొత్తం గా ఈ వ్యవహారం లో పలువురు సినీ ప్రముఖులు మరియు రాజకీయ ప్రముఖులు కూడా ఉన్నట్లుగా వెళ్లడి అయ్యింది.

నిర్మాత శంకర్ గౌడ ఇచ్చిన పార్టీలో మద్యం మరియు గ్రడ్స్ ఇవ్వడం జరిగిందని ఆ పార్టీకి తనీష్‌ కూడా హాజరు అయ్యాడని విచారణలో వెళ్లడయ్యింది. దాంతో తనీష్‌ ను విచారణకు హాజరు అవ్వాల్సిందిగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయమై ఎంక్వౌరీ చేస్తున్న పోలీసులు మరి కొందరికి కూడా నోటీసులు ఇచ్చారు. గతంలో హైదరాబాద్‌ డ్రగ్స్‌ రాకెట్‌ లో కూడా తనీష్‌ పేరు వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు మళ్లీ బెంగళూరు డ్రగ్స్ రాకెట్‌ వ్యవహారంలో కూడా హీరో తనీష్‌ పేరు రావడంతో ఆయనపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.