శర్వానంద్ కు ఇది పెద్ద అవమానం


యంగ్ హీరో శర్వానంద్ కెరీర్ ఆరంభించినప్పటి నుండి ఎన్నో విభిన్నమైన విలక్షణమైన సినిమాల్లో నటించాడు. ఆయన కథల ఎంపిక విధానం అందరికి ముచ్చట కలిగించేది. యంగ్ హీరోలు చాలా మంది ఆయన్ను అనుసరించి కథలను ఎంపిక చేసుకునే వారు అనడంలో సందేహం లేదు. కథల ఎంపిక విషయంలో ఆయన నిర్ణయం ను ఎన్నో సందర్బాల్లో ఎంతో మంది అభినందించారు. సినిమాలు సక్సెస్ ప్లాప్ లతో సంబంధం లేకుండా మంచి కథను తీసుకు వచ్చాడు.

మంచి కథతో సినిమాను చేశాడు అంటూ ఆయన గురించి ఎన్నో సార్లు మీడియాలో కథనాలు వచ్చాయి.. ఆయన సినిమాలకు రివ్యూలు కూడా వచ్చాయి. కాని ఈమద్య కాలంలో ఆయన జడ్జ్ మెంట్ తప్పుతున్నట్లుగా అనిపిస్తుంది. శర్వానంద్ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ నిరాశ పర్చుతున్నాయి. ఈమద్య వచ్చిన మహా సముద్రం కూడా శర్వానంద్ కు నిరాశే మిగిల్చింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో శర్వానంద్ అభిమానులు తీవ్రంగా నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికి కూడా శర్వానంద్ నుండి మళ్లీ మంచి సినిమాలు వస్తాయని వారు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇకపై అయినా శర్వానంద్ మంచి కథలను ఇంతకు ముందులా ఎంపిక చేసుకుంటే చూడాలని ఉందంటూ అభిమానులు కోరుకుంటున్నారు. ఈ సమయంలో శర్వానంద్ హీరోగా నటించిన ద్వి భాష చిత్రం ఒకే ఒక్క జీవితం. అమలా కీలక పాత్రలో నటించిన ఈ సినిమా కోసం శర్వానంద్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

విడుదల తేదీ కోసం శర్వానంద్ అభిమానులు ఎదురు చూస్తున్న సమయంలో ఈ సినిమాను డైరెక్ట్ ఓటీటీ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు మొదలయ్యాయి. శర్వానంద్ గత చిత్రాల ఫలితం నేపథ్యంలో ఒకే ఒక జీవితం సినిమాను థియేటర్ రిలీజ్ చేయడం కంటే ఓటీటీ స్ట్రీమింగ్ కు ఇవ్వడం వల్ల ప్రయోజనం ఎక్కువ గా ఉన్నట్లుగా నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ వారు భావిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

ఇప్పటి వరకు ఈ విషయమై తుది నిర్ణయం అయితే తీసుకోలేదు. ప్రస్తుతానికి చర్చలు జరుగుతున్నాయి… సాధ్యాసాధ్యాలు.. లాభ నష్టాలను బేరీజు వేసుకుని నిర్మాతలు ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ సమాచారం అందుతోంది. ఎక్కువ శాతం ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఎందుకంటే వారి నుండి సాలిడ్ ఆఫర్ ను నిర్మాతలు దక్కించుకున్నారట. అంతకు మించి థియేటర్ రిలీజ్ ద్వారా వస్తుందనే నమ్మకం లేదని తెలుగు మరియు తమిళ భాషలకు గాను అమెజాన్ ఇస్తున్న ఆఫర్ తో నిర్మాతలు సంతృప్తి చెందాలని భావిస్తున్నట్లుగా పుకార్లు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో శర్వానంద్ అభిమానులు సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ ను వ్యతిరేకిస్తున్నారు. ఇది శర్వానంద్ కు ఖచ్చితంగా పెద్ద అవమానం. బిజినెస్ సరిగా అవ్వడం లేదని ఓటీటీ కి ఇవ్వడం సబబు కాదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వార్తలు నిజం కావద్దని కోరుకుంటున్నామని వారు అంటున్నారు. ఈ పుకార్లకు డ్రీమ్ వారియర్ పిక్చర్స్ వారి స్పందన ఏంటీ అనేది చూడాలి.