సౌత్ ఇండియాలో టాప్ నటిగా త్రిష దశాబ్ద కాలానికి పైగానే కొనసాగింది. గత కొంత కాలంగా తెలుగు సినిమాల్లో పెద్దగా కనిపించని త్రిష, తమిళ చిత్రాల్లో మాత్రం తన మార్కును చూపిస్తోంది. ఇదిలా ఉంటే త్రిష పెళ్లి గురించిన వార్తలు మరోసారి షికార్లు చేస్తున్నాయి.
త్రిష పెళ్లి గురించి రూమర్లు రావడం ఇదేం మొదటిసారి కాదు. గతంలో చాలా సార్లే వచ్చాయి. గతంలో వ్యాపారవేత్త వరుణ్ మణియన్ తో త్రిషకు నిశ్చితార్ధం కూడా జరిగింది. అయితే ఏమైందో ఏమో కానీ అది కాస్తా క్యాన్సిల్ అయింది. ఆ తర్వాత నుండి త్రిష తిరిగి సినిమాలపై దృష్టి పెట్టింది.
మరోసారి త్రిష పెళ్లి వార్తలు వస్తున్నాయి. గత కొంత కాలంగా పెళ్లి గురించి బాగా ఆలోచించిన త్రిష ఒక బిజినెస్ మ్యాన్ తో పెళ్ళికి సిద్ధం అయిందని తెలుస్తోంది. మరి ఈ వార్తలపై క్లారిటీ త్వరలోనే రానుంది.