తమిళ హీరో జయం రవి, హీరోయిన్ త్రిషను ఉద్దేశిస్తూ కార్తీ చేసిన ఓ ట్వీట్ సంచలనం రేపింది. వారిద్దరినీ యువరాజు, యువరాణిలుగా పోల్చుతూ చేసిన ఈ ట్వీట్ ఆసక్తి రేపింది. ‘యువరాణి త్రిష.. మీ ఆజ్ఞ పాటించాను. యువరాజా జయం రవి.. నా పని పూర్తి చేశాను’ అనేది ఈ ట్వీట్ సారాంశం. ప్రస్తుతం ఈ ట్వీట్ ఆసక్తి రేకెత్తిస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. స్టార్ డైరక్టర్ మణిరత్నం దర్శకత్వంలో ప్రతిష్టాత్మక చిత్రం ‘పొన్నియన్ సెల్వం’ గురించే ఈ ట్వీట్ చేశారు కార్తీ.
ఈ సినిమాలో రాజు, రాణి పాత్రల్లో జయం రవి, త్రిష నటిస్తున్నారు. అత్యంత భారీ వ్యయంతో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటివలే ఈ సినిమా మొదటి భాగం పూర్తి చేసుకుంది. వచ్చే ఏప్రిల్ నెలలో ఈ సినిమా విడుదల కానుంది. సుభాస్కరన్ నిర్మాత. ఈ సినిమాలో భారీ తారగణమే నటిస్తోంది. త్వరలోనే మోషన్ పోస్టర్ రిలీజ్ చేయనున్నారు.