గ్యాప్‌లో రచయితగా మారిపోయిన త్రివిక్రమ్‌

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ ఈ ఏడాది ఆరంభంలో సంక్రాంతి కానుకగా అల వైకుంఠపురంలో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల నడుమ రూపొందిన ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ తో ఒక సినిమాను త్రివిక్రమ్‌ ప్లాన్‌ చేశాడు. అయితే కరోనా కారణంగా సినిమా ఆలస్యం అయ్యింది. ఎట్టకేలకు సినిమాను పట్టాలెక్కించాలనుకుంటున్న సమయంలో రాజమౌళి మర్చి వరకు వెయిట్‌ చేయాల్సిందిగా సూచించాడు. దాంతో మొత్తం ఏడాదికి పైగా ఎన్టీఆర్‌ డేట్లు ఇవ్వక పోవడంతో షూటింగ్‌ చేయక పోవడంతో త్రివిక్రమ్‌ రచయితగా మారినట్లుగా తెలుస్తోంది.

త్రివిక్రమ్‌ కెరీర్‌ ఆరంభం రచయితగానే అనే విషయం తెల్సిందే. ఇప్పుడు కూడా త్రివిక్రమ్‌ అదే పని చేస్తున్నాడు. అయ్యప్పనుమ్‌ కోసియుమ్‌ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించేందుకు పవన్‌ కోసం స్క్రిప్ట్‌ వర్క్‌ చేసిన త్రివిక్రమ్‌ ప్రస్తుతం అల్లు వారి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన రామాయణం కోసం కథా చర్చల్లో పాల్గొంటున్నాడట. తనకు అప్పగించిన పార్ట్‌ కు సంబంధించిన స్క్రిప్ట్‌ రాస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇందుకు గాను ఆయన భారీ మొత్తంను వసూళ్లు చేస్తున్నాడని కూడా అంటున్నారు. 2022 లో పట్టాలెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్న భారీ బడ్జెట్ రామాయణం కోసం త్రివిక్రమ్ రచయితగా వ్యవహరించబోతున్నాడు. ఇక ఎన్టీఆర్‌ తో మూవీని త్రివిక్రమ్ మార్చి లేదా ఏప్రిల్ వరకు మొదలు పెట్టే అవకాశం ఉంది.