ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్న మహిళలకు స్ఫూర్తిగా నిలిచిన ఉపాసన

ఉపాసన కొణిదెల ఆరోగ్యం విషయంలో ఎంతో పరిణితితో ఉంటారు. అందరూ ఆరోగ్యంగా ఎలా ఉండాలి అన్న విషయంలో ఉపాసన కొణిదెల ఎన్నో రకాల వీడియోలు, ఆర్టికల్స్ మనకు అందించారు. ఇక ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉపాసన చేసిన పనికి ఇప్పుడు ఎందరో మహిళలు స్ఫూర్తి పొందుతున్నారు.

బిఆర్సిఏ జీన్ టెస్ట్ ను చేయించుకున్నారు ఉపాసన. తాను చేయించుకోవడమే కాకుండా తనకు దగ్గరైన స్నేహితులను కూడా ఈ టెస్ట్ చేయించుకునేలా ప్రోత్సహించారు. ఈ టెస్ట్ చేయించుకోవడం వలన భవిష్యత్తులో బ్రెస్ట్, ఓవరీయన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయా లేవా అన్నది తెలుస్తుంది.

దీని వలన చాలా త్వరగా దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకునే వీలుంది. జాగ్రత్తపడడం మంచిదని ఉపాసన పిలుపినిస్తోంది. నిజమే కదా, తర్వాత బాధ పడే బదులు ముందే టెస్ట్ చేయించుకుంటే దాని ప్రకారం ఏం చేయాలో తెలుస్తుంది. మనమే కాకుండా మన చుట్టూ ఉన్నవారిని కూడా ప్రశాంతంగా ఉంచగలుగుతాం.