ఫారెస్ట్‌ ఫ్రంట్ లైన్‌ హీరోస్‌ కోసం ఉపాసన

మెగా పవర్ స్టార్‌ రామ్‌ చరణ్‌ సతీమణి ఉపాసన కొణిదెల చేసే కార్యక్రమాలు అన్ని ఇన్నీ కావు. ఆమె చేస్తున్న షో లతో మరియు ఆమె నిర్వహిస్తున్న కార్యక్రమాలతో ఎంతో మందికి ఆదర్శణంగా నిలిచారు. ఇప్పుడు ఫారెస్ట్‌ ఫ్రంట్‌ లైన్ వారియర్స్ కోసం ఆమె మద్దతు తెలిపేందుకు ముందుకు వచ్చారు. ఫారెస్ట్‌ ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్ కార్యక్రమానికి ఆమె బ్రాండ్‌ అంబాసిడర్ గా వ్యవహరించబోతున్నారు. ప్రస్తుతం కోవిడ్‌ పరిస్థితుల్లో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ముందు ఉంటున్న వీరికి ఉపాసన సెల్యూట్‌ చేశారు.

అడవుల్లో ఈ సమయంలో పెట్రోలింగ్‌ చేయడం అంటే మామూలు విషయం కాదు. రోజుకు 15 నుండి 20 కిలో మీటర్లు నడవాల్సి ఉంటుంది. కనుక వారు ఇలాంటి పరిస్థితుల్లో కూడా తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తమ విధులను నిర్వహిస్తున్నారు. అందుకే ఈ సందర్బంగా వారికి అండగా ఉండాలని భావిస్తున్నట్లుగా ఆమె పేర్కొంది. ఫారెస్ట్‌ ఫ్రంట్‌ లైన్‌ హీరోస్ కార్యక్రమానికి అంబాసిడర్‌ గా ఉపాసన ఉండటం ఆమె గొప్పతనంగా చెప్పుకోవచ్చు.