ఉప్పెన – జాతిరత్నాలు కలిస్తే..!

కరోనా లాక్ డౌన్ తర్వాత చిన్న పెద్ద సినిమాలు కలిసి వరుసగా బాక్సాఫీస్ మీద దండ యాత్ర చేస్తున్నాయి. ఈ ఏడాది ఆరంభం నుండి పెద్ద ఎత్తున సినిమాలు విడుదల అవుతున్నాయి. అందులో కొన్ని మాత్రమే సక్సెస్‌ అవుతున్నాయి. సూపర్‌ హిట్ టాక్ దక్కించుకున్న సినిమాలు క్రాక్‌, ఉప్పెన, జాతిరత్నాలు. ఈ మూడు సినిమాలు కూడా అందరిని ఆకట్టుకుంటున్నాయి. క్రాక్ విషయం పక్కన పెడితే ఉప్పెన మరియు జాతి రత్నాలు సినిమా యూత్ ఆడియన్స్ ను కట్టి పడేస్తున్నాయి.

ఈ రెండు సినిమాల కలయికలో ఒక సినిమా వస్తే అంటే ఆ సినిమా హీరో ఈ సినిమా దర్శకుడు కలిసి ఒక సినిమా చేస్తే ఎలా ఉంటుంది. ఖచ్చితంగా ఒక సెన్షేషన్‌ కాంబో అవుతుంది. ఆ కాంబో వర్కౌట్ కాబోతుంది. ఉప్పెన హీరో వైష్ణవ్‌ తేజ్ తో జాతి రత్నాలు దర్శకుడు అనుదీప్‌ ఒక సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. బీవిఎస్ఎన్‌ ప్రసాద్‌ నిర్మాణంలో ఈ సినిమా పట్టాలెక్కబోతుంది. జూన్‌ లేదా జులై వరకు సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందంటున్నారు. యాక్షన్‌ కథాంశంతో సినిమాను తీయబోతున్నట్లుగా అనుదీప్ చెబుతున్నాడు. త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.