తన తొలి చిత్రంతోనే సూపర్ రేంజ్ అందుకున్నాడు మెగా హీరో వైష్ణవ్ తేజ్. ఉప్పెన సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం 50 కోట్ల గ్రాస్ మార్క్ ను అందుకునే దిశగా వెళుతోంది. బాక్స్ ఆఫీస్ వద్ద ఇంకా ఉప్పెన ప్రవాహం ఉంది. ఇదిలా ఉంటే వైష్ణవ్ తేజ్ తన నెక్స్ట్ సినిమాను కూడా పూర్తి చేసిన విషయం చాలా మందికి తెలీదు.
సెన్సిబుల్ దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన గ్రామీణ నేపధ్యమున్న చిత్రంలో వైష్ణవ్ తేజ్ నటించాడు. కొండపోలేం అనే నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. రకుల్ ప్రీత్ సింగ్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. రియలిస్టిక్ నేపధ్యమున్న ఈ చిత్ర బిజినెస్ ఇటీవలే క్లోజ్ అయింది.
దిల్ రాజు క్యాంప్ నుండి బయటకు వచ్చిన లక్ష్మణ్ ఈ చిత్ర హక్కులను దాదాపు 11 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసాడు. ఈ సినిమా విడుదల తేదీను త్వరలో కన్ఫర్మ్ చేయనున్నారు.