లైగర్ ప్రామిస్ ను నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ

ఇండియన్ ఐడల్ ఫైనల్స్ చేరుకున్నాక తెలుగమ్మాయి షణ్ముఖ ప్రియకు ప్రామిస్ చేసాడు లైగర్ హీరో విజయ్ దేవరకొండ. ఫైనల్స్ లో గెలిచినా గెలవకపోయినా తన సినిమాలో అవకాశం ఇస్తున్నట్లు ప్రకటించాడు. స్వతహాగా విజయ్ కు పెద్ద ఫ్యాన్ అయిన విజయ్ తనకు అవకాశం ఇవ్వడం పట్ల షణ్ముఖ ప్రియ చాలా ఆనందం వ్యక్తం చేసింది.

ఇచ్చిన మాట ప్రకారంగా విజయ్ ఇప్పుడు తన చిత్రంలో షణ్ముఖ చేత పాట పాడించాడు. షణ్ముఖ ప్రియను తన ఇంటికి పిలిపించుకుని ఆమెకు హగ్ ఇచ్చి తన సంతోషాన్ని వ్యక్తం చేసాడు. పూరి గారితో మాట్లాడినట్లు తనకు సూట్ అయ్యే సాంగ్ కోసం చర్చించినట్లు తెలిపాడు.

అలాగే సాంగ్ రికార్డింగ్ అయ్యాక ఆమెకు శాలువా కప్పి సత్కరించారు. సాంగ్ రికార్డింగ్ బాగా జరిగిందా, నేను వచ్చే వారం వింటాను అని విజయ్ తెలిపాడు.