వీడియో : తిరుపతికి ప్రైవేట్ ప్లైట్ లో దేవరకొండ ఫ్యామిలీ

విజయ్ దేవరకొండ ఫ్యామిలీ ఈమద్య కాలంలో సోషల్ మీడియాలో చాలా సందడి చేస్తున్నారు. రౌడీ స్టార్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ మరియు అమ్మా నాన్నలతో ఈమద్య కాలంలో ఎక్కువ సమయంను గడుపుతున్నాడు. కరోనా ముందు వరకు వారిని ఎక్కువగా సోషల్ మీడియాలో చూసిందే లేదు. కాని ఈమద్య కాలంలో వారు రెగ్యులర్ గా కనిపిస్తూనే ఉన్నారు. తాజాగా దేవరకొండ ఫ్యామిలీ మొత్తం కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం జరిగింది. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తిరుమల కొండపై దేవరకొండ ఫ్యామిలీ మొత్తం దర్శణం చేసుకుని తిరిగి వస్తున్న సమయంలో మీడియా వారు తీసిన ఫొటోల్లో విజయ్ తల్లిదండ్రులను కూడా చూడవచ్చు. ఆనంద్ దేవరకొండ తాజాగా ఒక వీడియోను షేర్ చేశాడు. ఆ వీడియోలో తిరుపతి ట్రిప్ కు విమాన ప్రయాణం ఎలా జరిగింది అనేది అందులో పేర్కొన్నారు.

ప్రైవేట్ ప్లైట్ లో విజయ్ దేవరకొండ ఫ్యామిలీ హైదరాబాద్ నుండి తిరుపతి వెళ్లారు. అందులో ఈ ఫ్యామిలీ మాత్రమే ఉండటంతో సరదాగా గడిపినట్లుగా ఆ వీడియోలో అర్థం అవుతుంది. విమానం టేకాఫ్ సమయంలో విజయ్ దేవరకొండ అమ్మ కాస్త ఇబ్బంది పడ్డట్లుగా అనిపించినా ఆ తర్వాత అంతా నార్మల్ అయ్యింది. అమ్మ కూల్ గా ఉంటే నాన్న పేపర్ చదువుతూ బిజీగా ఉన్నాడని.. అన్నయ్య విజయ్ మాత్రం పనిలోనే ఉన్నట్లుగా పేర్కొన్నాడు. తన పుష్పక విమానం సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను విజయ్ చూస్తున్నట్లుగా ఆనంద్ తెలియజేశాడు.

నవంబర్ 12న థియేటర్ల ద్వారా విడుదల కాబోతున్న ఆనంద్ దేవరకొండ పుష్పక విమానం సినిమాకు నిర్మాతగా విజయ్ దేవరకొండ వ్యవహరించిన విషయం తెల్సిందే. విజయ్ దేవరకొండ నిర్మాణంలో ఇప్పటికే వచ్చిన సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇక తమ్ముడు ఆనంద్ దేవరకొండకు ఒక మంచి కమర్షియల్ సక్సెస్ కావాలనే ఉద్దేశ్యంతో స్వయంగా తానే రంగంలోకి దిగాడు. పుష్పక విమానం టైటిల్ పెట్టడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించిన యూనిట్ సభ్యులు ప్రమోషన్స్ తో సినిమాకు మరింతగా క్రేజ్ తీసుకు వచ్చేందుకు గాను ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక విజయ్ దేవరకొండ లైగర్ సినిమాలో నటిస్తున్నాడు. పూరి జగన్నాద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమా లో మైక్ టైసన్ నటిస్తున్న నేపథ్యంలో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. దేవరకొండ బ్రదర్స్ రాబోయే రోజుల్లో మంచి విజయాలను దక్కించుకోవలని తిరుమల శ్రీవారి ఆశీర్వాదం తీసుకన్నట్లుగా తెలుస్తోంది.