బిగ్‌ బాస్‌ 4: అభిజిత్‌కు విజయ్‌ దేవరకొండ మద్దతు

తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 ఫైనల్ వారంకు వచ్చేసింది. ఈ వారం మొత్తం అయిదు మంది ఉన్నారు. ఆ అయిదుగురిలో ఒకరు ట్రోఫీ దక్కించుకుంటారు. ఇన్నాళ్లు ఓట్లు ఒక లెక్క ఇకపై ఓట్లు ఒక లెక్క అన్నట్లుగా ఓట్లను కుమ్మరించాల్సిన సమయం వచ్చింది. అందుకే ఇంట్లో ఉన్న అయిదుగురుకు సంబంధించిన వారు వారి వాళ్ల కోసం ఓట్లు అడుగుతున్నారు. అభిజిత్‌ కోసం హీరో విజయ్‌ దేవరకొండ ఇండైరెక్ట్‌ గా మద్దతు తెలిపాడు. అభిజిత్‌ ఉన్న ఫొటోను షేర్‌ చేసి నా మిత్రులు ఎక్కడ ఉన్నా కూడా వారికి నా మద్దతు ఉంటుందని పేర్కొన్నాడు.

వారు ఎక్కడ ఉన్నా.. ఎందులో ఉన్నా కూడా ఆల్‌ ది బెస్ట్‌ అంటూ అభిజిత్‌ కు తన శుభాకాంక్షలను తెలియజేశాడు. ఇటీవలే అరియానాకు రామ్‌ గోపాల్‌ వర్మ నుండి మద్దతు లభించడంతో ఇప్పుడు అభిజిత్‌ కోసం విజయ్‌ దేవరకొండ రావడం ఆయన అభిమానులకు ఆనందాన్ని కలిగించే విషయం అంటూ ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అభిజిత్‌ విజేత అంటూ ఇప్పటికే చాలా నమ్మకంగా ఇండస్ట్రీ వర్గాల వారు మరియు ప్రేక్షకులు నమ్మకంగా చెబుతున్నారు. ఈ సమయంలో బిగ్‌ బాస్‌ లో ఉన్న అభిజిత్‌ కు రౌడీ స్టార్‌ మద్దతుతో ఆయనకు మరింతగా ఓట్లు పడటం ఖాయం అంటున్నారు.