టాలీవుడ్లో ప్రస్తుతం ‘జాతిరత్నాలు’ చిత్రం ఎలాంటి క్రేజ్‌ను క్రియేట్ చేసుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కలిసి నటిస్తుండగా, ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాకు ప్రమోషన్స్ కూడా అదిరిపోయే రేంజ్లో నిర్వహిస్తుంది చిత్ర యూనిట్.
ఈ సినిమా తాజాగా ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను చిత్ర యూనిట్ వరంగల్‌లో నిర్వహించారు. కాగా ఈ వేడుకకు ముఖ్య అతిథిగా రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హాజరయ్యాడు. ఈ సందర్భంగా జాతిరత్నాలు హీరోలతో ఆయనకున్న అనుబంధం గురించి విజయ్ దేవరకొండ గుర్తుకు చేసుకున్నాడు. ఇక ఈ సినిమా నిర్మాత నాగ్ అశ్విన్ గురించి విజయ్ మాట్లాడుతూ.. నాగ్ అశ్విన్ లేకపోతే విజయ్ దేవరకొండ లేడని ఎమోషనల్‌గా మారాడు. తనకు సినిమాల్లో అవకాశాలు రావడానికి ముఖ్యమైనవారిలో నాగ్ అశ్విన్ ఒకరు అంటూ విజయ్ చెప్పుకొచ్చాడు.
మొత్తంగా నాగ్ అశ్విన్ గురించి ఎమోషనల్‌గా మాట్లాడుతూ ఆయనపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు విజయ్ దేవరకొండ. ఇక విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ లైగర్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తుండగా, బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే ఈ సినిమాలో నటిస్తోంది.