రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాద్ దర్శకత్వంలో రూపొందుతున్న లైగర్ సినిమా గోవా షెడ్యూల్ ఇటీవలే పూర్తి అయ్యింది. తదుపరి షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ సభ్యులు ముంబయిలో ఒక సెట్ ను వేయిస్తున్నారు. ఆ తర్వాత సినిమా షూటింగ్ ను యూరప్ లో చేయాలని మొదట భావించారు. కాని కరోనా కారణంగా సినిమా షెడ్యూల్ ను మార్చినట్లుగా తెలుస్తోంది. యూరప్ లో కరోనా ఎక్కువగా ఉన్న కారణంగా అక్కడ షూటింగ్ ను క్యాన్సిల్ చేసినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
ముంబయి షెడ్యూల్ తర్వాత యూరప్ వెళ్లకుండా అక్కడ చేయాలనుకున్న సీన్స్ ను అబుదబీలో చేయబోతున్నట్లుగా చెయబోతున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు. అనన్య పాండే హీరోయిన్ గా రూపొందుతున్న ఈ సినిమా లో రమ్యకృష్ణ కీలక పాత్రలో కనిపించబోతున్న విషయం తెల్సిందే. ఈ సినిమా తో హిందీ ప్రేక్షకుల ముందుకు నేరుగా విజయ్ దేవరకొండ వెళ్తున్నాడు. రౌడీ స్టార్ మొదటి పాన్ ఇండియా మూవీ గా రూపొందుతున్న లైగర్ సెప్టెంబర్ 9వ తారీకున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.