ఆ విషయంలో విజయ్ దేవరకొండ స్ట్రిక్ట్ గా ఉంటాడట

రీసెంట్ గా ప్లాపులు వచ్చినా కానీ విజయ్ దేవరకొండ క్రేజ్ కు వచ్చిన లోటేమి లేదు. ప్రస్తుతం లైగర్ సినిమా చేస్తున్నాడు విజయ్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్యాన్ ఇండియా వైడ్ గా ఈ సినిమా రూపొందుతోంది. అనన్య పాండే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. లైగర్ చిత్రీకరణ సెప్టెంబర్ లో తిరిగి మొదలవుతుంది.

ఇదిలా ఉంటే తన కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇకపై తన చిత్రాలు అన్నీ కూడా ప్యాన్ ఇండియా వైడ్ గా చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే లైగర్ తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ చేయాల్సిన చిత్రానికి ప్యాన్ ఇండియా స్కోప్ లేదు. అందుకే శివ నిర్వాణ స్క్రిప్ట్ ను రిజెక్ట్ చేసి మరో స్క్రిప్ట్ తో రమ్మని సూచించాడట.

సుకుమార్ తో ప్యాన్ ఇండియా సినిమా చేసేలోగా మరో ప్రాజెక్ట్ ను పూర్తి చేయాలనుకుంటున్నాడు విజయ్.