జక్కన్న తండ్రికి కరోనా పాజిటివ్‌

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ కు కరోనా పాజిటివ్‌ అంటూ నిర్థారణ అయ్యిందట. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా వెళ్లడించాడు. ఫేస్‌ బుక్‌ ద్వారా తనకు కరోనా పాజిటివ్‌ అంటూ విజయేంద్ర ప్రసాద్‌ పేర్కొన్నారు. ఆయన వయసు రీత్యా కరోనా అంటే కాస్త ఆందోళన కలిగించే విషయమే. ప్రస్తుతానికి కరోనా వల్ల ఆయనకు ఎలాంటి తీవ్ర ఇబ్బంది అయితే లేదట. వైధ్యుల పర్యవేక్షణలో జాగ్రత్తలు తీసుకుంటూ విశ్రాంతి తీసుకుంటున్న నేపథ్యంలో ఆయన త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు దేవుడిని ప్రార్థిస్తున్నారు.

రాజమౌళి తెరకెక్కించే ప్రతి సినిమాకు కథను విజయేంద్ర ప్రసాద్‌ ఇస్తాడు. ఆ సినిమాలు అన్ని కూడా ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాయో తెల్సిందే. ఇండియాలోనే టాప్‌ రైటర్‌ గా ప్రస్తుతం విజయేంద్ర ప్రసాద్‌ కొనసాగుతున్నారు అనడంలో సందేహం లేదు. బాలీవుడ్‌ లో స్టార్‌ హీరోల సినిమాలకు స్క్రిప్ట్‌ అందిస్తున్న విజయేంద్ర ప్రసాద్‌ సీత అనే సినిమా ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని స్క్రిప్ట్‌ అందిస్తున్నాడు. ఇంకా పలు ప్రాజెక్ట్‌ లు ఆయన చేస్తున్న సంగతి తెల్సిందే.