మహేష్ కోసం కథను రాసే ముందు పూరిని కలుస్తా: విజయేంద్ర ప్రసాద్‌

ఇప్పటికే మహేష్‌ బాబు కోసం చత్రపతి శివాజీ కథ సిద్దం అయ్యిందని కొందరు అంటూ ఉంటే మరి కొందరు మాత్రం స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతుందని కొందరు అంటున్నారు. ఈ సమయంలోనే విజయేంద్ర ప్రసాద్ టాక్ షో అలీతో సరదాగా లో మాట్లాడుతూ ఇప్పటి వరకు మహేష్‌ బాబుతో సినిమాకు కథను సిద్దం చేయలేదని అన్నాడు. మహేష్‌ బాబుతో సినిమా అంటే కాస్త కష్టం అయ్యింది.. కథను తయారు చేయడం అంత ఈజీ కాదన్నాడు. ఇదే సమయంలో మహేష్‌ బాబు కోసం కథను సిద్దం చేయాలనుకున్నప్పుడు పూరి జగaన్నాధ్ ను కలిసి ఆ తర్వాత కథ వర్క్ ప్రారంభిస్తానంటూ చెప్పుకొచ్చాడు.