రాజమౌళి తదుపరి సినిమా మహేష్ బాబుతో అనే విషయంపై ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని మహేష్ బాబుతో వచ్చే ఏడాది సినిమాను మొదలు పెట్టే అవకాశం ఉంది. అయితే కథ ఏంటీ నేపథ్యం ఏంటీ అనే విషమయై పుకార్లు షికార్లు చేస్తున్నారు. చత్రపతి శివాజీ కథతో ఈ సినిమా ఉంటుందని కొందరు అనుకుంటూ ఉండగా మరి కొందరు ఈ సినిమా కథ సూపర్ హీరో కాన్సెప్ట్ తో ఉంటుంది అంటూ కొందరు అనుకుంటూ ఉన్నారు.
ఈ సమయంలో రచయిత విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తనతో మహేష్ బాబు మాట్లాడుతూ ఆఫ్రీకా అడవుల నేపథ్యంలో అడ్వంచర్ కథతో సినిమా ఉండాలని ఆశిస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు. అందుకోసం కథ ను సిద్దం చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు. కరోనా వల్ల ఇప్పటి వరకు ఎలాంటి చర్చ జరగలేదు కాని అందుకు సంబంధించిన చర్చలు జరుపబోతున్నట్లుగా మాత్రం చెప్పుకొచ్చాడు. ఆఫ్రికా వెళ్లి కథ కోసం రీసెర్చ్ చేయాల్సి ఉందని కూడా ఆయన పేర్కొన్నాడు.